హైదరాబాద్, వెలుగు:గ్లోబల్ డేటా సెంటర్ల నిర్వహణ సామర్థ్యంలో ముంబై ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానాన్ని దక్కించుకుంది. రియల్ఎస్టేట్కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం.. దరాబాద్ 27వ స్థానంలో నిలిచింది. నైట్ ఫ్రాంక్ గ్లోబల్ డేటా సెంటర్ అట్లాస్ 2026 నివేదిక 36 ప్రధాన గ్లోబల్ మార్కెట్లను విశ్లేషించింది. ముంబైకి 774 మెగావాట్లు, హైదరాబాద్కు 151 మెగావాట్ల లైవ్ సామర్థ్యం ఉంది. ఉత్తర అమెరికా సెంటర్లు తొలి ఐదు స్థానాలను ఆక్రమించగా అష్బర్న్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని టాప్ 10 డేటా సెంటర్ మార్కెట్లలోకి భారత్ వెళ్లాలంటే మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. విద్యుత్ సరఫరాను వేగవంతం చేయడం, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని విస్తరించడం చాలా అవసరమని రిపోర్ట్ పేర్కొంది.
