ఇండియా, న్యూజిలాండ్ ఎఫ్‌‌‌‌టీఏ.. అక్టోబర్20 నుంచి అమలు..మన ఎగుమతులపై జీరో టారిఫ్స్‌‌‌‌

ఇండియా, న్యూజిలాండ్ ఎఫ్‌‌‌‌టీఏ..  అక్టోబర్20 నుంచి అమలు..మన ఎగుమతులపై జీరో టారిఫ్స్‌‌‌‌
  •  రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం

న్యూఢిల్లీ: ఇండియా, న్యూజిలాండ్ మధ్య కుదిరిన  ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌‌‌‌టీఏ) వచ్చే నెల 20 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం భారీగా పెరిగే అవకాశం ఉంది.  ఎఫ్‌‌‌‌టీఏ ప్రకారం,  ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే న్యూజిలాండ్‌‌‌‌కు జరిగే  భారత ఎగుమతులపై ఎటువంటి సుంకాలు పడవు.  ప్రస్తుతం సిరామిక్స్, కార్పెట్లు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలపై న్యూజిలాండ్ విధిస్తున్న 10శాతం టారిఫ్స్‌‌‌‌ తొలగిపోనున్నాయి. 

అంతేకాకుండా  రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి భారత్‌‌‌‌కు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.90 లక్షల కోట్ల) ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌డీఐ) రానున్నాయి. అయితే, దేశీయ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డెయిరీ, ఉల్లి, శనగలు, బఠానీలు, మొక్కజొన్న, బాదం, కృత్రిమ తేనె, చక్కెర వంటి సెన్సిటివ్ సెక్టార్లను  ఈ  ఎఫ్‌‌‌‌టీఏ నుంచి ప్రభుత్వం మినహాయించింది.

న్యూజిలాండ్‌‌‌‌కూ లాభమే..  


ఎఫ్‌‌‌‌టీఏ ద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్‌‌‌‌లో విస్తరించేందుకు న్యూజిలాండ్‌‌‌‌కు వీలుంటుంది. ఈ దేశం నుంచే వచ్చే దిగుమతులపై అడ్డంకులు తగ్గుతాయి.   అంతేకాకుండా  అగ్రి ప్రొడక్షన్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌కు చెందిన అడ్వాన్స్​డ్​ -టెక్నాలజీల వాడకం పెరుగుతుంది. న్యూజిలాండ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వేగంగా అనుమతులు వస్తాయి.  ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక డెస్క్‌‌‌‌ను ఏర్పాటు చేయనుంది.