అక్టోబర్ 30న రోషన్ ‘ఏమో ఏమో ఇది’ మూవీ రిలీజ్

అక్టోబర్ 30న రోషన్ ‘ఏమో ఏమో ఇది’ మూవీ రిలీజ్

రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఏమో ఏమో ఇది’.  అక్టోబర్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు. ఈ శీతాకాలంలో ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రేమానుభూతిని అందించేందుకు సినిమా సిద్ధమవుతోందని మేకర్స్ తెలియజేశారు. 

 ‘హిట్’ ఫ్రాంచైజీ  తర్వాత  దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్న లవ్‌‌‌‌స్టోరీ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.  రోషన్ మేక, ప్రీతి ముకుందన్‌‌‌‌ల ఫ్రెష్ పెయిర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.