చొప్పదండిని రోల్మోడల్గా మారుస్తా : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండిని రోల్మోడల్గా మారుస్తా :  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, వెలుగు: చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే రోల్​మోడల్​గా మారుస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్​లోని ప్రభుత్వ స్థలాలను ఆర్డీవో షర్మిలతో కలిసి గురువారం పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు మధురానగర్​లోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రభుత్వ కార్యాలయాల కోసం కేటాయించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గంగాధర రెవెన్యూ, గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి, నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ రజిత, ఎంపీడీవో రాము తదితరులు పాల్గొన్నారు. 

పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తా..

రామడుగు, వెలుగు: పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సత్యం అన్నారు. రామడుగు మండల సర్వసభ్య సమావేశం గురువారం జరగ్గా ఎమ్మెల్యే హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్​కు నివాళి అర్పించారు. 

మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల రైతుబీమా ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి ఎం.అనిల్ ప్రకాశ్ కిరణ్, ఆర్డీవో షర్మిల, డిప్యూటీ ఈఈ ఎ.రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో  రాజేశ్వరి, తహసీల్దార్​రాజమల్లయ్య, ఏఎంసీ చైర్మన్ బి.తిరుమల, ఎంపీడీవో రాజేశ్వరి, అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.