సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే ఖబర్దార్ : ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి

సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే ఖబర్దార్ : ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి
  • బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై  ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి ఫైర్​ 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు నోరు జారితే ఖబర్దార్ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​ను ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టు సాయి హెచ్చరించారు. గురువారం గాంధీ భవ న్​లో ఆయన మీడియా సమావేశంలో  మాట్లాడారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న సీఎం రేవంత్​పై అడ్డగోలు మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు  చూస్తూ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. 

ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్, నిజామాబాద్​లో ఉన్నా..  తమ పార్టీ కార్యకర్తలు వదలరని, రోడ్డుపై ఉరి కించి కొడ్తారని హెచ్చరించారు. అరర్వింద్​కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని అధికార పార్టీ ఎంపీగా ప్రధానిపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావాలని సవాల్​ విసిరారు.