కదులుతున్న రైలు కింద పడి ఓయూ ఉద్యోగి మృతి..మృతుడు వరంగల్ జిల్లా వాసి

కదులుతున్న రైలు కింద పడి ఓయూ ఉద్యోగి మృతి..మృతుడు వరంగల్ జిల్లా వాసి

పద్మారావు నగర్, వెలుగు: కదులుతున్న రైలు నుంచి దిగుతూ దానికిందే పడి ఓయూకు చెందిన ఓ ఉద్యోగి మృతిచెందారని జీఆర్పీ సికింద్రాబాద్ పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా మడికొండకు చెందిన తాళ్లపల్లి నర్సింగ్ రావు(54) ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 8వ నంబర్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ వద్ద కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కిందే పడిపోయారు. దీంతో ఆయన ఎడమ కాలు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు బాధితుడిని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చికిత్స పొందుతున్న సమయంలో బీపీ ఎక్కువై, పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ సికింద్రాబాద్ పోలీసులు పేర్కొన్నారు.