- ఆగస్టు8 నుంచి 17 వరకూ దరఖాస్తునకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సమగ్ర శిక్ష విభాగంలోని ఖాళీ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం (ఎస్‌పీడీ), జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న గెజిటెడ్ హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఈనెల 8 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్, డీఈఓ ఆఫీసుల్లో కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ పోస్టులను డిప్యూటేషన్ మీద , అసిస్టెంట్ కోఆర్డినేటర్లు, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ పోస్టులను ఓడీ ప్రాతిపదికన నింపనున్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, సర్వీసు నిబంధనలు, ఇతర గైడ్లైన్స్ కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ www.schooledu.telangana.gov.in ను సందర్శించాలని కోరారు.
