శాయంపేట, వెలుగు: చలివాగు ప్రాజెక్టులో 17ఫీట్ల కంటే తక్కువగా ఉన్నాయని, ఇక్కడి నుంచి నీళ్లు తరలించేందుకు ప్రయత్నిస్తే సర్పంచులు, రైతులతో కలిసి పంప్ హౌస్‌ల ఎదుట ధర్నా చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇరిగేషన్ ఆఫీసర్లను హెచ్చరించారు. గురువారం హనుమకొండ జిల్లా శాయంపేట ఎంపీడీవో ఆఫీస్‌లో మండల స్థాయి మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ చేశారు. సమావేశాలు నిర్వహిస్తే మీటింగ్‌కు వచ్చామా వెళ్లామా అన్నట్లు ఉంటే ఎలా అని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హారికల్చర్ సహా పలువురు అధికారులు మీటింగ్‌కు రాకపోవడంపై కలెక్టర్‌కు లెటర్ రాయాలని ఎంపీడీవోను ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేసి, అన్ని చెరువులకు హద్దులు పెట్టాలని, శిఖం, కట్ట ఏరియా గుర్తించి ట్రెంచ్ కొట్టాలని ఆదేశించారు
