ఫేక్ ఐడీ చూపించి కోటిన్నర కట్నం గుంజుదామనుకున్నాడు.. ప్రీ వెడ్డింగ్ షూట్ టైంలో ప్లాన్ ఫెయిల్ !

ఫేక్ ఐడీ చూపించి కోటిన్నర కట్నం గుంజుదామనుకున్నాడు.. ప్రీ వెడ్డింగ్ షూట్ టైంలో ప్లాన్ ఫెయిల్ !

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పెళ్లి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. అల్కాపురి కాలనీ, కొత్తపేట్కు చెందిన పనస మధు అనే 30 ఏళ్ల యువకుడు తాను Food Corporation of India (FCI)లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా చర్లపల్లిలో ఉద్యోగం చేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. ఈ ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి నల్గొండ జిల్లా చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. పెళ్లి కోసం మొదట 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి తరువాత ఒకటిన్నర కోటి రూపాయల వరకట్నం కుదుర్చుకుని నల్గొండలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.

తరువాత “ప్రీ వెడ్డింగ్ షూట్” పేరుతో బాధితురాలిని తన గదికి పిలిపించి ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వేధింపులకు గురి చేశాడు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు అతని గురించి విచారణ చేయగా అతను నకిలీ ఐడీతో మోసం చేస్తున్నాడని బయటపడింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు చైతన్యపురి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి రెండు నకిలీ FCI ఐడీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్, “On Government Duty” అని రాసిన కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల సూచన:
* మాట్రిమోనియల్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
* ఉద్యోగం, వ్యక్తిగత వివరాలు పూర్తిగా ధృవీకరించుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
* అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.