నార్త్ ఇండియాలో పోహా గా పిలిస్తే సౌతిండియాలో దీన్ని అటుకుల పులిహోర అని అంటారు. ఇప్పుడంటే మనకు చాలా వెరైటీ ఫాస్ట్ ఫుడ్స్ పరిచయం అయ్యాయి. కానీ, ప్రపంచంలోనే మొదటి ఫాస్ట్ ఫుడ్ గా అటుకులకు పేరుంది. రకరకాల కూరగాయలు, పల్లీలు, పప్పులతో కలిపి ఎన్నో రకాలుగా దీన్ని తక్కువ టైంలో తయారుచేయొచ్చు. గుప్పెడు అటుకుల్ని వేడి వేడి పాలల్లో వేసుకొని తినడం. ఏమీ తోచకుంటే అటుకులు బెల్లం తినడం మనకు వెనకటి నుంచి అలవాటుగా వస్తోంది.
కానీ, తరతరాలుగా నార్త్ సంప్రదాయ చిరుతిండిగా వస్తున్న ఈ పోహ.. మంచి పోషకాహారం. ఇందులో ఉండే పిండి పదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు, ప్రొటీన్లు వంటి అనేక పోషకాలు మన ఇమ్యూనిటీని పెంచుతాయి. షాప్ లో దొరికే బిస్కట్లు, జంక్ ఫుడ్ తో పోలిస్తే దీంతో వంద రేట్లు లాభాబున్నాయి.
వంద గ్రాముల వరి అటుకుల్లో ఐరవై మిల్లిగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణులకి పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అయితే, మనం తయారు చేసుకోబోయే అటుకుల పులిహోరలో పల్లీలతో పాటు కిచెన్ లో ఉండే రకరకాల పప్పులు, కొంచెం నిమ్మరసం, క్యారెట్ తరుగు కలుపుకుంటూ చేసుకుంటే మరిన్ని పోషకాలు యాడ్ చేసినట్లే!
కావాల్సినవి
- అటుకులు-120 గ్రాములు,
- క్యారెట్ తురుము - కొద్దిగా
- పల్లీలు, పప్పులు - తగినన్ని
- ఆవాలు--ఒక టీ స్పూను..
- ఇంగువ - చిటికెడు
- పచ్చిమిర్చి- కొన్ని
- కొత్తిమీర- తగినంత
- కరివేపాకు - రెండు రెమ్మలు
- పసుపు, జీలకర్ర - అర టీ స్పూన్,
- నిమ్మరసం - ఒక స్పూను; వేరు శెనగ -ఒక టేబుల్ స్పూను..
- పప్పులు -ఒక టేబుల్ స్పూన్
- అయిల్ - రెండు టీ స్పూనులు..
- నెయ్యి- ఒక స్పూను
- ఉప్పు- తగినంత
తయారీ
అటుకులను నీళ్లలో వేసి పైపైన కడగాలి. తర్వాత నీళ్లు వంపి అటుకులు పక్కన పెట్టాలి. పాన్లోనూనె, నెయ్యి వేసి వేదిక్కాక దానిలో ఆవాలు, జీలకర్ర లాంటి డ్రై సై సెన్వేసి వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి లేదా వెండు మర్చ కరివేపాకు.. పసుపు వేసి కలపాలి. స్టవ్ సిమి పెట్టి దాంట్లో అటుకులు వేసి కలపాలి. తర్వాత నిమ్మరసం, క్యారెట్ తరుగు, కొత్తిమీద కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి!
అటుకులు.. ఎన్నో లాభాలు
అటుకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలోకి పిండిపదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. కాబట్టి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు కూడా ఇది మంచి ఆహారం. మొక్కజొన్న బటుకుల్లో ఐరన్, బి కాంప్లెకు పుష్కలంగా ఉంటాయి. గోధుమ అటుకుల్లో ఐరన్, పీడుతోపాటు క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ గా దీన్ని పాలల్లో కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ అడువులో ఉంటుంది. అటుకుల్లోని ఫైటో కెమికల్స్.యాంటీ ఆర్సీడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. పిండిపదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే దార్న్ ఫ్లేక్స్ అందరికే మంచిగా ఉపయోగపడతాయి.
►ALSO READ | ఆధ్యాత్మికం : మౌనం మూడు రకాలు.. ఈ మూడింటి మధ్య ఉన్న తేడా ఏంటీ.. ఈ కాలానికి ఏది బెస్ట్ అంటే..!
అన్ని రకాల పోషకాలు కావాలనుకునేవాళ్లు నాలుగైదు రకాల అటుకుల్ని పాలల్లో వేసుకునీ, వాటికి ఎండుద్రాక్ష, బాదంతో పాటు ఏదైనా రెండు రకాల పండ్లు కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్స్టాంట్ సర్జీ వస్తుంది. అటుకులు పా బయాటిక్ పుడకూడా! ధాన్యాన్ని వాసబెట్టి వడగట్టి మిల్లు పడతారు.తద్వారా ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు.
ఇలా చేయడంవల్ల పులిసినట్లు అవుతాయి. టైంలో వాటిలో ప్రాజయాటిక్ బ్యాక్టీరియా తయారవుతుంది. పొట్ట అప్పటి అయితే ఈ అటుకుల్ని నీళ్లతో కలిపి తీసుకుంటే.. మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది.
