సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నా..

సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నా..

యూఏఈ: టీమిండియాకు అన్ని ఫార్మాట్స్‌‌‌లోనూ కుదురుగా ఆడతాడని అజింక్యా రహానేకు పేరుండేంది. కానీ అతడ్ని టీమ్ మేనేజ్‌‌మెంట్ మాత్రం టెస్టులకే పరిమితం చేసింది. ఎలాగైనా తిరిగి వన్డే, టీ20ల్లో మెన్ ఇన్ బ్లూకు ఆడాలని రహానే భావిస్తున్నాడు. రేపటి నుంచి మొదలవనున్న ఐపీఎల్ పదమూడో సీజన్‌‌లో సత్తా చాటి టీమిండియాలో ప్లేస్‌‌ను పదిలపర్చుకోవాలని సమాయత్తం అవుతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నానని రహానె చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున గ్రౌండ్‌‌లోకి దిగనున్న రహానేకు ఈ టోర్నీ చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో రహానె గురించి ముంబై మాజీ కోచ్ వినాయక్ సామంత్ పలు విషయాలు పంచుకున్నాడు. ఎక్కువగా ఆలోచించడం రహానె బ్యాటింగ్‌‌పై ప్రభావం చూపించిందన్నాడు.

‘కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం రహానేకు అలవాటు. అతడు ముంబై తరఫున అరంగేట్రం చేసినప్పుడు ఒత్తిడిని తనపై వేసుకునేవాడు. టీమ్ బాధ్యతలను తన భుజాలపై వేసుకొని గెలిపించాలని భావించేవాడు. దీని వల్ల విఫలమయ్యేవాడు. ఆ తర్వాత ఒత్తిడిని పక్కనబెట్టి ప్రశాంతంగా ఆడటం అలవాటు చేసుకున్నాడు. అప్పట్నుంచి చాలా రన్స్ చేశాడు. గత ఐపీఎల్ సీజన్‌‌లో షాట్స్‌‌ త్వరగా ఆడటం వల్లే రహానె ఔటయ్యాడు. ఈ సీజన్‌లో అతడు రాణిస్తాడు’ అని సామంత్ చెప్పాడు.