కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో ఫైళ్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యాక కోర్టును మోడల్ కోర్టుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద తెలిపారు. శుక్రవారం కోదాడలో ఒకటవ అదనపు జిల్లా జడ్జి శివరాం ప్రసాద్‌తో కలిసి నూతనంగా నిర్మిస్తున్న నాలుగు కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం సబ్ జడ్జి సురేశ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కోదాడలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని, భవన నిర్మాణ పనులను త్వరగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
