టమాటాకు ప్రత్యామ్నాయం ఇవే..అదే రుచి..అదే అనుభూతి

టమాటాకు ప్రత్యామ్నాయం ఇవే..అదే రుచి..అదే అనుభూతి

టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం టామాటా కేజీ వంద రూపాయల పైగా పలుకుతోంది. ఈ క్రమంలో సామాన్యులు టమాటా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టమాటాకు బదులు ఈ ఆహార పదార్థాలను కూరల్లో వాడుకుంటే.. టమాటో ఫ్లేవరే వస్తుంది. ఈ  5 సాధారణ పదార్థాలను మీ వంటల్లో వాడడంతో మీరు టామాటాను తిన్న రుచి కలుగుతుంది. 

ప్రతీ ఇంట్లో టమాటా ముఖ్యమైన కూరగాయ. ప్రతీ కూరలో టమాటా ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం టమాటా రేటు పెరిగిన కారణంగా వాటికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ఐదు పదార్థాలు మీకోసం..

టమాటాకు బదులు 5 ఇతర పదార్థాలు మీరు వంటల తయారీలో ఉపయోగించవచ్చు. అవేంటంటే గుమ్మడి కాయ, పచ్చిమామడికాయ, చింతపండు, వెనిగర్, పెరుగు వంటి పదార్థాలను టమాటాకు బదులు కూరల్లో వాడి టమాటా రుచిని ఆస్వాదించవచ్చు. 

  • గుమ్మడికాయలు టమాటాల వలె సహజమైన తీపిని కలిగి ఉంటాయి.  కాబట్టి  వంటకాల్లో టామాటాకు బదులు గుమ్మడికాయను వేసుకుంటే అదే రుచి వస్తోంది. 
  • పచ్చి మామిడికాయలు కూడా టమాటాలాగా తీపి, అదే రుచిని అందిస్తాయి. అందువల్ల వంటల్లో పచ్చి మామిడికాయలను వాడితే టమాటా రుచి దొరుకుతుంది.
  • చింతపండును కూడా టమాటాకు బదులు వంటల్లో వాడుకోవచ్చు. ఖరీదైన టమాటాలకు బదులుగా చింతపండు రుచిని జోడిస్తే.. టమాటా వేసుకున్న రుచి వస్తుంది.
  • పెరుగు టమాటాకు బదులు వంటల్లో వాడితే కూర క్వాంటిటిని పెంచుతుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. టామాటాకు బదులు  కూరల్లో పెరుగు కలిపితే చిక్కదనాన్ని, టామాటా తిన్న అనుభూతిని ఇస్తుంది. కాబట్టి టామాటాకు బదులు వెజ్, నాన్ వెజ్ అన్ని వంటకాల్లో పెరుగును వేసుకోవచ్చు. 
  • వెనిగర్ ఇది వంటకానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. దీనికి టామాటాలాగా పుల్లని రుచిని ఇచ్చే గుణం ఉంది. కాబట్టి టామాటా లేనప్పుడు వెనిగర్ ని వేసుకుంటే ఆహార పదార్థాలకు చక్కని రుచిని, చిక్కదనాన్ని ఇస్తుంది. 

పైన తెలిపిన ఆహార పదార్థాలను  టామాటాకు బదులు వంటల్లో వాడుకోవచ్చు. ఖరీదైన టామాటా ప్రత్యామ్నాయంగా ఇవి వేసుకుంటే అచ్చం టమాటా వేసి వంట చేసినట్లుగా ఫీల్ అవ్వచ్చు.