గన్నవరం ఎయిర్ పోర్టులో మాయమైన మహిళ ఆచూకీ లభ్యం

గన్నవరం ఎయిర్ పోర్టులో మాయమైన మహిళ ఆచూకీ లభ్యం
కువైట్ నుంచి వచ్చేటప్పుడు భర్తతో ఫోన్లో వాగ్వాదం.. భర్తకు భయపడి ఎవరికీ చెప్పకుండా కడపలో చెల్లి వద్దకు వెళ్లానంటున్న దుర్గ దుర్గతోపాటు.. ఆమె భర్త సత్యనారాయణకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు విజయవాడ: గన్నవరం ఎయిర్ పోర్టులో మాయమైన మహిళ ఆచూకీ లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ ఈనెల 16వ తేదీన కువైట్ నుంచి వచ్చి.. గన్నవరం ఎయిర్ పోర్టులో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత కూడా తనకు ఫోన్ చేసిన తన భార్య ఇంటికి రాలేదని… ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుండడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన తర్వాత ఎటువెళ్లింది తెలియరాలేదు. దీంతో ఈ విషయం కలకలం రేపింది. కిడ్నాప్ అన్న అనుమానాలు చెలరేగడం సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాల్ డేటాను పరిశీలించడంతోపాటు.. గొడవ గురించి తెలుసుకుని మరింత లోతుగా విచారణ చేశారు. భర్తతో గొడవ వల్లే ఆమె ఆచూకీ లేకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు కడపలో ఫోన్ స్విచాన్ చేయడంతో ఆమె ఆచూకీ లభించింది. పోలీసులు ట్రేస్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. తన భర్త కోపంతో గొడవకు దిగడం వల్లే భయపడి కడపలో చెల్లి దగ్గరకు వెళ్లానని సమాధానం ఇచ్చింది. దీంతో భార్యా భర్తలు ఇరువురికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. for moe News.. హైదరాబాద్​లో 48 శాతం తగ్గిన ఇళ్ల అమ్మకాలు  ఇన్​స్టాగ్రామ్​లో దోస్తీ​.. ఇంటికొచ్చి దోపిడీ