సమ్మెచేయడానికి రాలే.. బతుకమ్మ ఆడేందుకే వచ్చాం

సమ్మెచేయడానికి రాలే.. బతుకమ్మ ఆడేందుకే వచ్చాం

హైదరాబాద్: ఆర్టీసీ డిపోలో బతుకమ్మను ఆడటానికి వెళ్లిన మహిళలను అడ్డుకున్నారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో జరిగింది. అక్కడికి బతుకమ్మను ఆడటానికి వచ్చిన మహిళలు మీడియాతో మాట్లాడారు. తాము ప్రతీ సంవత్సరం ఆర్టీసీ డిపోలో బతుకమ్మను ఆడుకుంటమని ఈ సారి మాత్రం పోలీసులు తమను అడ్డుకున్నరని తెలిపారు. సమ్మెచేయడానికి తాము రాలేదని బతుకమ్మను ఆడటానికే వచ్చామని చెప్పారు. కనీసం డిపో ముందు అయినా ఆడుకుంటామంటే అందుకు పోలీసులు ఒప్పుకోలేరని చెప్పారు. ఇందుకు తమ నిరసనను తెలియచేస్తున్నట్లు చెప్పారు.

గౌరవ ముఖ్యమంత్రి గారు బతుకమ్మను తిరిగి పంపడం గౌరవప్రదం కాదని అన్నారు. 126మంది కార్మికులతో నిజాం నవాబు ఈ ఆర్టీసీని  మొదలు పెట్టారని చెప్పారు. ప్రస్తుతం 10వేల 450 బస్సుల తో, 50వేల మంది కార్మికుల తో TSRTC సంస్థ పని చేస్తుందని తెలిపారు. RTC లాస్ లో నడవడానికి కారణం ప్రభుత్వమేనని అన్నారు.  ప్రతీ RTC కార్మికుడు ప్రతీ రోజు 10గంటలు పని చేస్తున్నారని చెప్పారు. పని ఒత్తిడి తీవ్రంగా ఉందని చెప్పారు.

అయితే ఇక్కడ లేడీ పోలీసులు లేకపోవడంతో బతుకమ్మను ఆడటానికి వచ్చిన మహిళలను రోప్ వేసి అడ్డకున్నారు కానిస్టేబుల్స్.

144 సెక్షన్ అమలులో ఉంది వెళ్లిపోండి: మేడ్చెల్ పోలీస్

ఇటు మెడ్చెల్ బస్ డిపోలో కూడా మహిళలు బతుకమ్మను ఆడేందుకు వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అన్ని డిపోల దగ్గర 144సెక్షన్ అమలులో ఉందని.. మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.