విమెన్స్ జావెలిన్‌లో ఏడో స్థానంతో సరి

విమెన్స్ జావెలిన్‌లో ఏడో స్థానంతో సరి

యుగీన్: వరల్డ్​చాంపియన్‌‌‌‌షిప్స్‌‌ విమెన్స్ జావెలిన్‌‌త్రో వరుసగా రెండో ఎడిషన్‌‌లో ఫైనల్ చేరి పతకంపై ఆశలు రేపిన ఇండియా అథ్లెట్ అన్ను రాణి  ఆఖరాటలో మరోసారి నిరాశ పరిచింది. శనివారం జరిగిన ఫైనల్లో జావెలిన్‌‌ను కేవలం 61.12 మీటర్లు మాత్రమే విసిరి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. తన రెండో ప్రయత్నంలో ఈ దూరం నమోదు చేసిన రాణి.. మిగతా ఐదు ప్రయత్నాల్లో కనీసం 60 మీటర్ల దూరం కూడా అందుకోలేకపోయింది. ఆరు త్రోలలో రాణి వరుసగా 56.18 మీ., 61.12 మీ., 59.27 మీ., 58.14 మీ., 58.70 మీ నమోదు చేసింది. కనీసం తన పర్సనల్, ఈ సీజన్​ బెస్ట్​ 63.82 మీ. మార్కును కూడా చేరుకోలేకపోయింది. వరల్డ్​ చాంపియన్‌‌షిప్స్‌‌లో పోటీ పడ్డ మూడోసారి కూడా పతకం లేకుండానే వెనుదిరిగింది. 2019లో ఫైనల్లో ఎనిమిదో ప్లేస్ లో నిలిచిన రాణి, 2017లో ఫైనల్​ కూడా చేరుకోలేకపోయింది. కాగా, డిఫెండింగ్​చాంపియన్​ కెస్లే లీ బార్చర్​ (ఆస్ట్రేలియా) 66.91 మీటర్లతో మళ్లీ గోల్డ్​ సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన కరా వింగర్​ 64.05 మీటర్లతో సిల్వర్​, జపాన్​ అథ్లెట్​హరుక కిటగుచి 63.27 మీటర్లతో బ్రాంజ్​ గెలిచారు.