యాదాద్రి, వెలుగు : జిల్లా అభివృద్ధికి హ్యాండ్ బుక్ పునాదిగా పని చేస్తుందని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ఎ. భాస్కరరావు తెలిపారు. హ్యాండ్ బుక్లో పూర్తి సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ డైరెక్టరీ రూపకల్పనలో భాగంగా చేపట్టిన సర్వే ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రతి రెవెన్యూ గ్రామం, పట్టణ వివరాలు సమగ్రంగా సేకరించి హ్యాండ్ బుక్లో నమోదు చేయాలని సూచించారు. ఈ సేకరణతోనే రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి మార్గదర్శకాలు రూపొందుతాయని చెప్పారు. సింగన్నగూడెంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగులు సేవా నిరతిని చాటాలని సూచించారు.
