ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి : యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి : యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆలేరు (యాదాద్రి), వెలుగు: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని క్లస్టర్ రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో తక్కువ నీటితో సాగు చేయగలిగే జొన్నలు, పెసలు, మినుములు, కంది, ఆముదం, ఆయిల్ ఫామ్ వంటి లాభదాయకమైన పంటలను ఎంచుకోవాలని సూచించారు. 

విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌‌‌‌‌‌‌‌తో కలిసి మాట్లాడారు. భవిష్యత్​లో నీటి కొరత రాకుండా ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతీ వ్యవసాయ క్షేత్రంలో పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.