యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాస్

యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాస్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ గా బర్ల శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కమిషనర్ గా ఉన్న లింగస్వామిని ప్రభుత్వం హైదరాబాద్ సెక్రటేరియట్ కు బదిలీ చేయగా, ఆయన ప్లేస్ లో హుజూర్​నగర్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన శ్రీనివాస్ ను యాదగిరిగుట్టకు బదిలీ అయ్యారు. కాగా, యాదాద్రి జిల్లా వలిగొండకు చెందిన బర్ల శ్రీనివాస్ గతంలో ఆలేరు మున్సిపల్ కమిషనర్ గా కూడా విధులు నిర్వర్తించారు.