జొమాటోతో ఉబెర్‌ ఈట్స్‌ విలీనం

జొమాటోతో ఉబెర్‌ ఈట్స్‌ విలీనం

భారతీయ ఆహార సరఫరా సంస్థ జొమాటో, అమెరికన్‌ ఆన్‌లైన్‌ ఆహార సంస్థ ఉబెర్‌ ఈట్స్‌ ఒక్కటయ్యాయి. ఆ రెండు సంస్థలు దాదాపు రూ.2500 కోట్ల విలువైన బిజినెస్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. దీని ప్రకారం ఉబెర్‌ ఈట్స్‌ జొమాటోతో కలిసిపోయింది. అందుకు గాను ఉబెర్‌కు… జొమాటోలో 9.9 శాతం వాటా లభించింది. అంతే కాకుండా ఉబెర్‌ ఈట్స్‌ వినియోగదారులందరనీ జొమాటోకు బదలయించారు. అయితే ఉబెర్‌ ఈట్స్‌ ఉద్యోగులను మాత్రం జొమాటో తీసుకోదట. భారత్‌లో పనిచేస్తున్న 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు పదవీ విరమణ ఇవ్వడంగానీ… వేరే విభాగాలకు మళ్లించడం చేస్తారట.

భారత్‌లో ఆహార సామ్రాజ్యాన్ని స్థాపించి దానిని 500 పైగా నగరాలకు విస్తరించినందుకు సంతోషిస్తున్నామన్నారు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. లేటెస్ట్ గా  ఉబెర్ ఈట్స్ తో కలిసిపోవడంతో ఆహార సరఫరా రంగంలో మరింత బలోపేతం కానుందన్నారు.