రూ.346.6 కోట్ల నష్టం.. 225 నగరాల్లో జొమాటో సేవలు నిలిపివేత

రూ.346.6 కోట్ల నష్టం.. 225 నగరాల్లో జొమాటో సేవలు నిలిపివేత

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. దీంతో ఆయా నగరాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దాదాపు 225 నగరాల్లో వ్యాపారం అంతగా సాగడం లేదు. కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవడం ఎంతో ముఖ్యమని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జొమాటో వెల్లడించింది. అయితే.. సేవలు నిలిపివేసిన నగరాల జాబితాను మాత్రం వెల్లడించలేదు. 

గత అక్టోబరు నుంచి ఫుడ్‌ డెలివరీ రంగంలో వ్యాపారం మందకొడిగా సాగడమే ఇందుకు ప్రధాన కారణమని జొమాటో భావిస్తోంది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ, ప్రధానంగా 8 నగరాల్లో ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది. మరోవైపు.. కంపెనీ 225 నగరాల్లో సేవలు నిలిపివేయడం వల్ల మరింత మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.