హాలీవుడ్ కు పయనమైన ఆలియాభట్

హాలీవుడ్ కు పయనమైన ఆలియాభట్

హాలీవుడ్ మూవీ ఛాన్స్ కొట్టేసిన ఆలియా భట్ ఈ సినిమా షూటింగ్ కోసం హాలీవుడ్ కు పయనమైంది. గాల్ గాడోట్, జామీ డోర్నన్ కీలక పాత్రలు పోషిస్తున్న హార్ట్ ఆఫ్ స్టోన్  (Heart of Stone) మూవీ షూటింగ్ మొదలవుతుండడంతో ఇవాళ ఆమె హాలీవుడ్ కు బయలుదేరి వెళ్లింది. హాలీవుడ్ మూవీకోసం వెళ్తున్న విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి వెల్లడించింది. హాలీవుడ్ మూవీ షూటింగ్ కు వెళ్తుంటే నెర్వస్ గా.. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నట్లు ఫీలవుతున్నా. ఎనీవే నాకు అందరూ శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ అభిమానులకు రిక్వెస్ట్ చేసింది. 
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీతో తెలుగు ప్రజలకు చేరువైన ఆలియాభట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండగా.. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’, డార్లింగ్స్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న ఓ సినిమాకు కూడా ఓకే చెప్పింది. 

 

ఇవి కూడా చదవండి

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా తెలంగాణ బిడ్డ

వస్తున్నా అంటున్న జూ.ఎన్టీఆర్

గుడ్ న్యూస్: తగ్గనున్న వంటనూనెల ధరలు