వస్తున్నా అంటున్న జూ.ఎన్టీఆర్

వస్తున్నా అంటున్న జూ.ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ నెక్ట్స్ మూవీ ఏంటీ అనే విషయంలో నెలకొన్న ఉత్కంఠ వీడింది. చిత్ర యూనిట్ పేర్కొన్నట్లు మే 19వ తేదీ గురువారం సాయంత్రం 7.02 గంటలకు చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చేసింది. అంతకుముందు ఓ ఫొటోను విడుదల చేసింది. ఇది చూసిన ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా.. అంటూ ఎన్టీఆర్ పలికిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

చేతిలో రెండు కత్తులు పట్టుకుని ఉన్న ఎన్టీఆర్ ను చూసి ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ - యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇది ఆయనకు 30వ సినిమా. అనిరుధ్ మ్యూజిక్ ను అందించనున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ నేపథ్యంలో సినిమా ఉంటుందని చిత్ర వీడియోను చూస్తే అర్థమౌతోంది. మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దీనిని విడుదల చేశారు. ఇక కేజీఎఫ్ (KGF) దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాకు సంబంధించిన న్యూస్ శుక్రవారం వస్తుందని తెలుస్తోంది. 

ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వచ్చిన తర్వాత మరేమి సినిమా రూపొందలేదు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ ప్రభంజనం సృష్టించింది. అంతర్జాతీయంగా ఈ సినిమా మంచి పేరు సంపాదించింది. రికార్డులు సృష్టించింది. దాదాపు మూడున్నరేళ్లు ఈ సినిమా కోసం పని చేశారు. అప్పటి వరకు ఎలాంటి సినిమా ఒప్పుకోలేదు జూ. ఎన్టీఆర్. ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

మరిన్ని వార్తల కోసం : -
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తారల తళుకులు


జూ.ఎన్టీఆర్ 30వ సినిమా క్రేజీ అప్‌‌డేట్