కొత్త పెళ్లి కూతురు రష్మికకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఆత్మీయ కానుక

కొత్త పెళ్లి కూతురు రష్మికకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఆత్మీయ కానుక

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని సినీ నటి రష్మిక మందన మర్యాదపూర్వకంగా కలిసింది. మార్చి 4న హైదరాబాద్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్కు ఆహ్వానించేందుకు సీఎం నివాసానికి రష్మిక వెళ్లింది. రేవంత్ రెడ్డి కుటుంబం రష్మికను సాదరంగా ఆహ్వానించింది. 

సీఎం రేవంత్ రెడ్డి భార్య గీత.. కొత్త పెళ్లి కూతురైన రష్మికకు బొట్టు పెట్టి చీరను కానుకగా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో గడిపిన సమయం చాలా ఆనందాన్ని ఇచ్చిందని.. అందమైన కానుక ఇచ్చినందుకు రష్మిక ధన్యవాదాలు చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసిన సమయంలో దిగిన ఫొటోలను రష్మిక తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.

తెలుగు తెరపై ‘గీత గోవిందం’గా అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట నిజ జీవితంలోనూ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ 2026, ఫిబ్రవరి 26న (గురువారం) రాజస్థాన్‌‌లోని ఉదయ్‌‌పూర్ వేదికగా వివాహ బంధంతో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. అక్కడి 'మొమెంటోస్ బై ఐటీసీ' రిసార్ట్స్‌‌లో అత్యంత వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. తెలుగు సంప్రదాయం ప్రకారం రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశాడు. అదే రోజు సాయంత్రం రష్మిక పుట్టినింటి ఆచారమైన 'కొడవ' సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం సరదాగా సాగింది.

►ALSO READ | With Love OTT: ఓటీటీలోకి సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. రూ.4 కోట్ల బడ్జెట్‌, 34 కోట్ల కలెక్షన్స్..

మార్చి 4న రిసెప్షన్
అతికొద్దిమంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న విజయ్, రష్మిక..  సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌‌లోని తాజ్ కృష్ణ హోటల్‌‌లో రిసెప్షన్‌‌ ఏర్పాటు చేశారు. టాలీవుడ్‌‌ మొదలు బాలీవుడ్‌‌ వరకు పలువురు సినీ సెలెబ్రిటీస్‌‌ ఈ వేడుకకు హాజరు కానున్నారు.