పెద్దపల్లి, వెలుగు: మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు పోలీసులకు లొంగిపోయిన తర్వాత, మొదటిసారి ఆదివారం పెద్దపల్లిలోని సొంతింటికి చేరాడు. ఈ సందర్భంగా మల్లోజుల తన సోదరులు, వారి పిల్లలతో గడిపాడు. అలాగే పాత మిత్రులు పలువురు ఆయనను కలిసి మాట్లాడారు. 1980లో పెద్దపల్లిని వీడిన మల్లోజుల పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీలో కీలక పదవులు నిర్వహించారు.
ఇటీవల మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోతున్న క్రమంలో ప్రభుత్వం ముందు లొంగిపోయాడు. లొంగుబాటు అనంతరం ఆయన రాక కోసం పెద్దపల్లిలోని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లికి చేరిన మల్లోజులతో ఆయన స్నేహితులు, బంధువులు ఆనందంగా గడిపారు.
