T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో ఈ రోజు కోల్‌కతాలో భారత్–వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. దీనిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అతడు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఈ మైదానంలో మంచి రికార్డు కలిగి ఉన్నాడు.. ఈడెన్ గార్డెన్స్‌లో అతను 22 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసి అద్భుతమైన సగటును కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా వరుణ్ కొనసాగుతున్నాడు. అయితే సూపర్-8 దశలో అతని ప్రదర్శన కొంత తగ్గినప్పటికీ, ఈడెన్ గార్డెన్స్ అతనికి ఫామ్ తిరిగి అందించగల వేదికగా మారనుందని బవుమా అంచనా వేశాడు.
వెస్టిండీస్ బ్యాటింగ్ పరంగా ఏ జట్టుతోనైనా సమానంగా పోటీపడగలదు.. కానీ భారత్ స్కోరులో అదనంగా 20 రన్స్ జోడించే సామర్థ్యం కలిగిన జట్టు.. ముఖ్యంగా బౌలింగ్‌లో భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉందని సఫారీల వన్డే కెప్టెన్ బావుమా తెలిపారు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ వంటి బౌలర్లు ఉన్నారు.. ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివం దూబే తుది జట్టులో ఉన్నారని పేర్కొన్నాడు. అలాగే దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్ రగిసో రబడా ప్రదర్శనపై కూడా బవుమా స్పందించాడు. ఈ టోర్నీలో రబడా ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ, వెస్టిండీస్‌పై మెరుగైన ప్రదర్శన చేశాడని వెల్లడించాడు. డ్రాప్ క్యాచ్‌లు కారణంగా అతని గణాంకాలు మెరుగ్గా కనిపించలేదని టెంబా బవుమా పేర్కొన్నాడు.
అయితే లుంగి ఎంగిడీ, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, ఆన్‌రిచ్ నోర్జే లాంటి బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో సౌతాఫ్రికా విజయానికి కారణమని కెప్టెన్ బవుమా ప్రశంసించాడు. పెద్ద టోర్నమెంట్లలో ఒత్తిడిని తట్టుకుని రబడా ప్రత్యేక ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. మొత్తానికి, కోల్‌కతాలో జరిగే భారత్–వెస్టిండీస్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. బౌలింగ్ బలం, ముఖ్యంగా స్పిన్ ప్రభావం కారణంగా భారత్ సెమీఫైనల్‌కు చేరుతుందని ప్రోటీస్ సారథి టెంబా బవుమా అంచనా వేశాడు.
