ట్రిపుల్ ఐటీ, మ్యాట్విజ్ ఇంజన్యూటీ మధ్య ఎంవోయూ

ట్రిపుల్ ఐటీ, మ్యాట్విజ్ ఇంజన్యూటీ మధ్య ఎంవోయూ

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మ్యాట్ విజ్ ఇంజన్యూటీ ప్రైవేట్ లిమిటెడ్  సంస్థల మధ్య ఎంఓయూ కుదిరినట్లు వీసీ గోవర్ధన్ ఆదివారం తెలిపారు. ఎంఓయూపై వర్సిటీ ఓఎస్డీ, పాలన అధికారి మురళీధర్, మ్యాట్ విజ్ ఇంజన్యూటీ సహ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యనిర్వాహణ అధికారి విష్ణు జిత్ రాథోడ్ సంతకాలు చేశారు. ఎంఓయూ ద్వారా విద్యార్థులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. 

మెటలర్జీ మెటీరియల్స్ ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో నైపుణ్య శిక్షణ కల్పించడంలో ఇరు సంస్థలు సమన్వయంతో పని చేస్తాయని, దేశంలో అతికొద్ది విద్యాసంస్థల్లో మాత్రమే ఉన్న మెటలర్జీ విభాగం బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న కారణంగా మరిన్ని సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. 

కార్యక్రమంలో మెటలర్జీ విభాగాధిపతి కిరణ్ కుమార్, అసోసియేట్ డీన్ లు విఠల్, శేఖర్, మహేశ్, ఓఎస్డీ మురళీ దర్శన్ పాల్గొన్నట్లు వీసీ గోవర్ధన్ వెల్లడించారు.