స్త్రీల గొప్పతనం చాటేలా ‘సరస్వతి’ సినిమా

స్త్రీల గొప్పతనం చాటేలా ‘సరస్వతి’ సినిమా

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన  చిత్రం ‘సరస్వతి’.  తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె నిర్మించింది. మార్చి 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సిమ్రాన్, డైరెక్టర్ నందినీ రెడ్డి, నిర్మాత స్వప్నాదత్, శరత్‌‌‌‌కుమార్  అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. వరలక్ష్మి శరత్‌‌‌‌కుమార్ మాట్లాడుతూ ‘స్త్రీలని గౌరవించడం మనందరి కర్తవ్యం. అలాంటి మంచి సందేశం వున్న సినిమా ఇది.

సోషల్ మెసేజ్‌‌‌‌తో పాటు ఎంగేజింగ్‌‌‌‌గా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా ఉంటుంది. ఈ సినిమాతో మా నాన్నగారిని గర్వపడేలా చేస్తానని నమ్ముతున్నాను. ఫ్యామిలీ సపోర్ట్‌‌‌‌ను మర్చిపోలేను.  ప్రకాష్ రాజ్ గారు,  ప్రియమణి గారు  నా విజన్‌‌‌‌ని మరో స్థాయికి తీసుకువెళ్లారు’ అని చెప్పింది. చాలామంది అమ్మాయిలకు ఈ చిత్రం ధైర్యాన్నిస్తుందని రాధిక శరత్‌‌‌‌కుమార్ అన్నారు.  మనసులో నిలిచిపోయిన కథ ఇదని, ఇందులో తాను నటించడం హ్యాపీ అని ప్రియమణి చెప్పారు.  నిర్మాత పూజా శరత్‌‌‌‌కుమార్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.