- సిటీ చేరుకున్న ఇండియా.. విమెన్స్ హాకీ టీమ్
- 8 నుంచి గచ్చిబౌలిలో మెగా టోర్నీ
హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీ ఆతిథ్యానికి హైదరాబాద్ రెడీ అవుతోంది. ఈనెల మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే మెగా టోర్నీ కోసం ఇండియా టీమ్ ఆదివారం నగరానికి చేరుకుంది. ఈ టోర్నీ కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) 20 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించింది. వెటరన్ గోల్ కీపర్, మాజీ కెప్టెన్ సవితా పునియా వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
మిడ్‌ఫీల్డర్ సలీమా టెటె కెప్టెన్సీలో ఇండియా ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. కాగా, ఈ టోర్నీలో ఇండియా సహా మొత్తం ఎనిమిది దేశాలు పాల్గొంటున్నాయి. తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఆగస్టులో జరిగే వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవుతాయి. ఇండియా టీమ్ తన తొలి పోరులో 8న ఉరుగ్వేతో తలపడనుంది. ఆ తర్వాత వరుసగా స్కాట్లాండ్ (9న), వేల్స్ (11న) జట్లతో పోటీ పడుతుంది.
ఇండియా టీమ్:
* గోల్ కీపర్లు: బన్సారీ సోలంకి, బిచ్చు దేవి ఖరీబామ్; డిఫెండర్లు: సుశీల చాను, నిక్కీ ప్రధాన్, మనీషా చౌహాన్, ఉదిత, ఇషికా చౌదరి;
* మిడ్ ఫీల్డర్లు: నేహా, సలీమా టెటె (కెప్టెన్), సునెలిత టొప్పో, సాక్షి రాణా, వైష్ణవి విఠల్ ఫాల్కే, రుతుజా పిసల్, దీపికా సోరెంగ్;
* ఫార్వర్డ్స్: నవనీత్ కౌర్, ఇషికా, లాల్‌రెమ్‌సియామి, బ్యూటీ డంగ్ డంగ్, బల్జీత్ కౌర్, అన్ను.
