సిద్దిపేట, వెలుగు: టెన్త్ క్లాస్ జీవితంలో కీలకమని, ఏకాగ్రతతో చదివితేనే లక్ష్యాన్ని సాధిస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ హైస్కూల్‌లో ఆదివారం టెన్త్ విద్యార్థులకు నిర్వహించిన విజయీభవ ప్రేరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్టూడెంట్ స్థితిని గతిని మార్చేది టెన్త్ క్లాసేనని, మంచి మార్కులతో పాస్ కావాలని సూచించారు.
రాష్ట్రమంతా బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు ఒక ఎత్తయితే.. సిద్దిపేట స్టూడెంట్స్ కు వస్తున్న సీట్లు ఒకెత్తన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్‌లో చదివి టాప్ ర్యాంక్ సాధించిన 30 మంది విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా జర్నలిస్టులకు నిర్వహించిన క్రికెట్ పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.
