కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తారల తళుకులు

 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తారల తళుకులు

ఫ్రాన్స్ లో 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేడుకల్లో భారత్ ‘కంట్రీ ఆఫ్ హానర్ ’గా నిలిచింది. సెంట్రల్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ తో పాటు పలువురు స్టార్స్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇండియాలో తీసే... ఫారెన్ మూవీస్ కు రాయితీలు ప్రకటించారు అనురాగ్ ఠాకూర్ . కేన్స్ జ్యూరీలో జడ్జ్ గా దీపికా పదుకొనే ఉన్నారు. 

ఐశ్వర్యారాయ్, తమన్నా భాటియా, పూజా హెగ్డే, ఊర్వశి రౌతెలా, హీనాఖాన్, కమల్ హాసన్, ఏ.ఆర్.రెహమాన్, మాధవన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ రెడ్ కార్పెట్ పై మెరిశారు. కమల్ హాసన్ విక్రమ్,  మాధవన్ రాకెట్రీ: ది నంబియార్  చిత్రాల ట్రైలర్స్,  మ్యూజిక్ డైరెక్టర్  AR రెహమాన్  డైరెక్ట్ చేసిన లే మస్క్ స్క్రీనింగ్ కి అర్హత పొందాయి.



కేన్స్  ఫిలిం ఫెస్టివల్ లో ‘ఇండియన్ పెవిలియన్ ’ని ప్రారంభించారు అనురాగ్  ఠాకూర్. ఇఫీ గోవా 2022 పోస్టర్ ని ఆవిష్కరించారు. భారతదేశంలో చెప్పడానికి చాలా కథలు ఉన్నాయన్న ప్రధాని మోడీ సందేశాన్ని వినిపించారు అనురాగ్ ఠాగూర్. వరల్డ్ కు కంటెంట్ హబ్  గా మారే శక్తి ఉన్న కంట్రీ ఇండియా అన్నారు.  

20 ఏళ్లల్లో షర్మిలా ఠాగూర్, ఐశ్వర్యా రాయ్, విద్యా బాలన్, శేఖర్ కపూర్ వంటి ఎందరో కేన్స్  ఫెస్టివల్ లో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. ఈసారి ఆ గౌరవం దీపికా పదుకొనెకు దక్కింది. ఈ 75వ కాన్స్  వేడుకల్లో సృజనాత్మకతను, ప్రతిభను సెలబ్రేట్  చేసుకోవడానికి భారతదేశం, ఫ్రాన్స్  కలిశాయన్నారు అనురాగ్ ఠాగూర్. ప్రముఖ నటుడు కమల్  హాసన్, ప్రముఖ డైరెక్టర్ కమ్ యాక్టర్ శేఖర్ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రెడ్ కార్పెట్ పై నడిచారు.

కేన్స్ లో ‘ఇండియన్  పెవిలియన్ ’ ఓపెనింగ్ లో డైరెక్టర్ మామే ఖాన్ పాట పాడగా... దీపికా పడుకొనె, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా స్టెప్పులేశారు. ఇది ఆరంభమే... భారతదేశం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా, కేన్స్  చలన చిత్రోత్సవమే ఇండియాకు వచ్చే రోజు వస్తుందన్నారు జ్యూరీ న్యాయనిర్ణేత దీపికా.