- డాక్టర్ మెడలోని గొలుసు ఎత్తుకెళ్లిన దుండగుడు
కూకట్పల్లి, వెలుగు: సాధారణంగా మహిళలను లక్ష్యంగా చేసుకునే స్నాచర్స్.. తాజాగా ఓ పురుషుడిని టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ చేయడం కూకట్పల్లిలో కలకలం రేపింది. ప్రగతినగర్‌కు చెందిన డాక్టర్ నందిపల్లి కిరణ్ (40) శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఒంటరిగా వాకింగ్‌కు బయలుదేరాడు.
ఈ క్రమంలో స్కూటీపై వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి అతడి మెడలోని 24 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
