మరో బాలీవుడ్ మూవీతో బిజీ అయిన కీర్తి సురేష్

మరో బాలీవుడ్ మూవీతో బిజీ అయిన కీర్తి సురేష్

వరుస  కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది కీర్తి సురేష్.  ఓ వైపు ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తూనే, మరోవైపు స్టార్ హీరోలకు జోడీగానూ అలరిస్తోంది.  తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె రెండేళ్ల క్రితం ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఆ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తాజాగా కీర్తి సురేష్​   మరో హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజ్ కుమార్‌‌‌‌ రావుకు జోడీగా ఆమె నటిస్తున్న చిత్రం ‘రఫ్తార్’. ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  అమెజాన్ స్టూడియోస్ సమర్పణలో రాజ్ కుమార్‌‌‌‌ రావు భార్య, నటి పత్రలేఖ నిర్మిస్తోంది. 

 జులై 24న ఈ  సినిమాను విడుదల చేయనున్నట్టు శనివారం ప్రకటించారు. అనురాగ్ ఠాకూర్, రోహన్ వర్మ, తాన్య మణికంఠ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పోటీతత్వ విద్యా ప్రపంచంలోని లోపాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. కార్పొరేట్ పోటీ, సక్సెస్ కోసం ఆరాటపడే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. డబ్బు, అధికారం మనుషుల సంబంధాలను ఎలా మారుస్తాయనే అంశాన్ని   ఇంటెన్స్ థ్రిల్లర్ డ్రామాగా దర్శకుడు రూపొందిస్తున్నాడు. 

ఇందులో కీర్తి సురేష్​  ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో కనిపించనుండటంతో బాలీవుడ్ మార్కెట్‌‌పై తను పెట్టుకున్న ఆశలు ఈ చిత్రంతో నెరవేరేలా అనిపిస్తోంది. మరోవైపు  విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్థన్’  చిత్రంతోపాటు  ఓ తమిళ, మలయాళ సినిమాల్లో కీర్తి సురేష్ నటిస్తోంది.