బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో పోలీసులు మర్ని వివరాలు సేకరించారు. డ్రగ్స్ పార్టీపై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం పార్టీకి అటెండైన 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు. వీరిలో తిరువీడుల అర్జున్ రెడ్డి, కౌషిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పంజుగుల రోహిత్ రెడ్డి, టిడిపి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఈ పార్టీకి సిమ్లా నుంచి బెంగళూరు అడ్వకేట్ కౌశిక్ రవి అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు గుర్తించారు పోలీసులు. కౌశిక్ రవి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్నేహితుడు . సిమ్లా ట్రిప్ లో గుర్తుతెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు కౌశిక్ రవి. రోహిత్ రెడ్డి పిఏ సిల్వర్ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో కౌశిక్ రవిని ప్రశ్నించారు పోలీసులు . సిల్వర్ శరత్ కుమార్ దగ్గర రెండు కొకైన్ పాకెట్స్ దొరికాయని.. కొకైన్ అందరికీ పంచి మిగిలినది జేబులో పెట్టుకున్నట్టు శరత్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు.
మార్చి 14న రాత్రి మోయినాబాద్‌లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌పై పోలీసులు సోదాలు చేశారు. పార్టీ జరుగుతుండగా డ్రగ్స్, మద్యం వినియోగం చేసినట్లు గుర్తించారు. పోలీసులపై ఫామ్ హౌస్ నుంచి కాల్పులు జరిపినట్లు మోహినాబాద్ పోలీస్ స్టేషన్ SI నయిమ్ఉద్దీన్ ఫిర్యాదులో చేశారు. వారి నుంచి జర్మనీ తయారీ చెందిన రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక లైవ్ రౌండ్, నాలుగు ఖాళీ కార్ట్రిడ్జ్‌లు సీజ్ చేశారు.
పైలెట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర నుంచి కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. భారీగా విదేశీ మద్యం బాటిళ్లు, 48 బీర్ బాటిళ్లు, డాన్ జూలియో, రాయల్ సల్యూట్, చీవాస్, బెల్వెడేర్ వోడ్కా సీజ్ చేశారు. పార్టీకి హాజరైన 10 మంది పురుషులు, ఒక మహిళపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
FIR లో మొత్తం 11 మంది
- మోరవినేని రమేష్
- పుట్ట మహేష్ కుమార్
- పంజుగుల రోహిత్ రెడ్డి
- వరమచనేని శ్రావణ్ కుమార్
- నమిత్ శర్మ
- పంజుగుల రితేష్ రెడ్డి
- నల్లపనేని విజయ కృష్ణ
- కౌషిక్ రవి
- తిరువీడుల అర్జున్ రెడ్డి
- ఆర్. ప్రియాంక రెడ్డి
- సిల్వరి శరత్ కుమార్
