కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం పట్టువస్త్రాలను సమర్పించింది. ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ప్రతినిధులకు మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, ఆలయ ధర్మకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలను అందజేశారు. తిరుమల శ్రీవారే కొడంగల్‌కు వేంచేసినట్లుగా భక్తులు భావించే ఈ ఆలయానికి గత 55 ఏండ్లుగా టీటీడీ శేషవస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 16 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.
