గ్యాస్ కొరత.. హైదరాబాద్హోటళ్లకు.. రోజుకు రూ.100 కోట్ల నష్టం!

గ్యాస్ కొరత.. హైదరాబాద్హోటళ్లకు.. రోజుకు రూ.100 కోట్ల నష్టం!

హైదరాబాద్: నగరంలో వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా కార్యకలాపాలు అంతరాయం కలిగి ఉండటంతో  హెూటల్ ,రెస్టారెంట్ పరిశ్రమ రోజుకు రూ.100 కోట్లకు పైగా ఆర్థిక నష్టాలను చవిచూస్తోంది. హైదరాబాద్ సిటీలో దాదాపు 70వేల పైగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. గత రెండు రోజుల్లో ఈ రంగం ఇప్పటికే దాదాపు రూ.50 కోట్ల నష్టాలను చూసిందని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. గ్యాస్ కొరతతో చాలా రెస్టారెంట్లు మెనూలను తగ్గించాల్సి వచ్చింది..తక్కువ గ్యాస్ వినియోగించే పరిమిత మెనూ ఐటెమ్లను మాత్రమే తయారు చేస్తున్నారు. ఇక వీధుల్లో తినుబండారాల వ్యాపారులు LPGకొరతతో మూసివేసారు. అదే సమయంలో LPG ధర పెరగడంతో కొన్ని హెూటళ్ళు ,రెస్టారెంట్లు టిఫిన్లు ,భోజనాల రేట్లను పెంచాయి. 

నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ప్రకారం.. గ్యాస్​కొరతతో చిన్న రోడ్ సైడ్ తినుబండారాలు,టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద ఎత్తున హెూటళ్ళు ,రెస్టారెంట్లకు తీవ్ర ఆర్తిక నష్టం జరిగింది. ప్రభావితం చేస్తోంది. తిరిగి వ్యాపారం పుంచుకోవాలంటే LPG సరఫరాలో కనీసం 50 శాతం హోటళ్లు, టిఫిన్​ సెంటర్లకు కేటాయించాలని కోరుతున్నారు. 

LPG కి ప్రత్యామ్నాయంగా  కట్టెల పొయ్యి వాడాలను ప్రభుత్వాలు, అధికారులు సూచిస్తున్నప్పటికీ పూర్తిగా కట్టెలకు మారడం ఆచరణాత్మక పరిష్కారం కాదని రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. బిర్యానీలు, బోజనం సంబంధిత వంటలను  కట్టెల పొయ్యిపై వండొచ్చు గానీ, కూరలు, స్టార్లర్లు, స్నాక్స్​, ఫాస్ట్​ ఫుడ్​ వంటి వంటలకు LPG ఉంటేనే వండటం సాధ్యమవుతుందని చెబుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి NRAI లేఖ.. 

రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు ,ఆహార సంస్థలకు కమర్షియల్​ LPG సిలిండర్ల తగినంత సరఫరాను చేయాలని NRAI రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖలో NRAI హైదరాబాద్ , తెలంగాణలోని ఇతర పట్ణణాల్లో టెక్​ నిపుణులు, విద్యార్థులు,టూరిస్టులకు రోజువారీ  సేవలందించే రెస్టారెంట్లు, కేఫ్ లు,టిఫిన్ సెంటర్లకు పెద్ద సంఖ్యలో  ఉన్నాయని NRAI తెలిపింది.