పద్మారావు నగర్, వెలుగు: బేగంపేట మయూరి మార్గ్‌లోని మే ఫ్లవర్ అపార్ట్మెంట్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులోని 208 నంబర్ ఫ్లాట్‌లో మంటలు చెలరేగగా, అప్రమత్తమైన ఇంట్లోని దంపతులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంటి సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. దేవుడి వద్ద పెట్టిన దీపంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
