సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ కోసం భారీ క్లైమాక్స్

సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ కోసం భారీ క్లైమాక్స్

సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్‌‌‌‌ ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో  కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి తేజ్ కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌‌‌‌కు సంబంధించి కీలక అప్‌‌‌‌డేట్ ఇచ్చారు నిర్మాతలు.

ప్రస్తుతం హై- ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ  క్లైమాక్స్ కోసం రూ.20 కోట్లకు పైగా కేటాయించారని,  35 రోజుల షెడ్యూల్ జరగనుందని తెలియజేశారు. ఇందులో 18 భారీ యాక్షన్ బ్లాక్‌‌‌‌లు ఉంటాయని,  స్టంట్ డైరెక్టర్ కెవిన్ మాస్టర్ ఈ సీక్వెన్స్‌‌‌‌లను కొరియోగ్రఫీ చేస్తున్నాడని చెప్పారు.

సాయి దుర్గ తేజ్ ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్‌‌‌‌పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు.  ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్‌‌‌‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్నారు.