జూ.ఎన్టీఆర్ 30వ సినిమా క్రేజీ అప్‌‌డేట్

జూ.ఎన్టీఆర్ 30వ సినిమా క్రేజీ అప్‌‌డేట్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. కొరటాల శివతో ఈ సినిమా రూపొందుతోందని.. మేకర్స్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్ డేట్ ను మే 19వ తేదీ గురువారం 7.02 నిమిషాలకు ప్రకటించనున్నట్లు ట్విట్టర్ లో Yuvasudha Arts ట్వీట్ చేసింది. మే 20వ తేదీ జూ.ఎన్టీఆర్ బర్త్ డే అనే సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో కత్తి పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఫుల్ మాస్ తరహాలో ఎన్టీఆర్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల శివతో ఎన్టీఆర్ తో సినిమా అంటేనే భారీ అంచనాలు నెలకొంటాయి. ఈ పోస్టర్ తో ఒక్కసారిగా క్యూరియాసిటీ మరింతగా పెరిగిపోయింది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. గతంలో కొరటాల శివతో ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చిందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే... రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీ రికార్డులను సృష్టించింది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ తేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సక్సెస్ సాధించింది. దీంతో ఎన్టీఆర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా మూడున్నరేళ్లు టైం కేటాయించాడు. తర్వాత.. ఈ మూడేళ్ల గ్యాప్ ను పూర్తి చేసేందుకు వరుసగా సినిమాలను ఒప్పేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన 30వ సినిమా కొరటాలతో చేయబోతున్నారు. పూర్తి వివరాలు తెలియాలంటే..కొన్ని గంటలు వేయిట్ చేయాల్సిందే.

మరిన్ని వార్తల కోసం : -

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌పై తెలుగు ఫిలిం ఛాంబర్ గరంగరం


సినిమాలపై ట్రోలింగ్ ఎక్కువైంది