సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌పై తెలుగు ఫిలిం ఛాంబర్ గరంగరం

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌పై తెలుగు ఫిలిం ఛాంబర్ గరంగరం

సినిమాలపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్‌‌పై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆగ్రహంగా ఉంది. సినిమాలు వాటి టికెట్ల రేట్ల విషయంలో ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని, నటుల విషయంలో కూడా నిర్లక్ష్యంగా ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడింది. సోషల్ మీడియాకు కట్టుబాటు ఉండాలనే ఫిలిం ఛాంబర్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కంటెంట్ మీద విమర్శలు చేయడం కరెక్టే గానీ.. వ్యక్తిగతంగా ఆ విమర్శలు ఉండకూడదని సూచిస్తున్నారు. 2022, మే 19వ తేదీ గురువారం ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా... నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ...

OTTలపై తొలుత నుంచి సెన్సార్ లేదు : -
సోషల్ మీడియాలో సినిమాలపై  ట్రోలింగ్ ఎక్కువైందని, ఓటీటీ (OTT)లపై తొలుత నుంచి సెన్సార్ లేదన్నారు. ప్రభుత్యంతో దీనిపై చర్చించాలని సూచించారు. పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ కృషి చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. నిర్మాతక మండలి కూడా గ్రూపులుగా విడిపోయిన పరిస్దితి ఉందని.. ఒక విధంగా వ్యవస్ద వ్యక్తుల చేతికి వెళ్లిందన్నారు. సినిమా టికెట్ రేట్లపై నిర్మాతలు ఎవరిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నట్లు ప్రస్తావించారు. ప్రభుత్వాలతో సినిమా టికెట్ లకు ఫ్లెక్సిబుల్ రేట్లు ఉండాలని అడిగితే బావుండేదని, డిమాండ్ కు తగ్గట్టు రేట్లు పెట్టాలన్నారు. గతంలోలాగా అందరూ కూర్చోని మాట్లాడుకోవాలని.. సోషల్ మీడియాకు కట్టుబాటు ఉండాలని తెలిపారు. కంటెంట్ మీద విమర్శ మంచిదే..‌కానీ వ్యక్తిగతంగా విమర్శలు వద్దని నిర్మాత ఆదిశేషగిరి రావు తెలిపారు. 

సెలబ్రేటీలు కూడా మనుషులే : -
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఈ మద్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. అందరికీ కుటుంబాలుంటాయి..సెలబ్రేటీలు కూడా మనుషులే..సభ్యతగా ఉండటం అందరికీ అవసరమన్నారు. న్యూస్ కోసం నెగిటివ్ ప్రచారాలు చేస్తూ.. చులకన చేస్తున్నట్లు తెలిపారు. దీనిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. 

సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం : -
మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ... మీడియా అనేది నేడు అత్యవసరమని.. సోషల్ మీడియాలో మాత్రం అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నట్లు తెలిపారు. ఎంతో కష్టపడి నటులుగా పేరు, గౌరవం తెచ్చుకున్న వారిపై అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. శ్రీకాంత్, శారద, కవితలు చనిపోయినట్లు రాంగ్ వార్తలు పోస్టులు చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. మా అధ్యక్షుడు విష్ణు గురించి చులకనగా పోస్టులు పెడుతూ.. ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనిపై చిత్ర పరిశ్రమ ఏకమై ఖండిస్తొందని మాదాల రవి తెలిపారు. 

25 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నా: -
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. తన మీద వచ్చిన వచ్చిన రాంగ్ న్యూస్ లు ఎవరి మీద రాలేదేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలపై ఇష్టారీతిన‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తాను 25 సంవత్సరాలుగా వీటితో సఫర్ అవుతున్నట్లు, దీనిపై లీగల్ గా ఫైట్ చెయ్యెచ్చు.. కానీ దానికి సమయం, డబ్బు లేదన్నారు. ఎన్నో బాధ్యతలు ఉంటాయని, తాను ఎదో కులాన్ని కించపరినట్లు ప్రచారం చేస్తున్నారని.. గొప్ప క్వాలిటి గురించి మాత్రమే‌ మాట్లాడినట్లు తెలిపారు. ఆర్య వైశ్యులు ఎవరైనా ఫీల్ అయితే క్షమాపణలు చెబుతున్నట్లు, ఎవరిమీద ఎవరు క్యాష్ చేసుకుంటున్నారో ఆలోచించాలన్నారు. ఇకనుంచైనా అసత్య ప్రచారాలు చేసే వారిపై, సినిమా వారైనా‌ కంట్రోల్ చెయాలని‌ కోరుతున్నట్లు జీవితా రాజశేఖర్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం : -
ఎవరినైనా బాధపెడితే క్షమించండి

నిర్మాతల మధ్య బ్లాంక్ చెక్ అనేది ఒక ఆయుధం