నిర్మాతల మధ్య బ్లాంక్ చెక్ అనేది ఒక ఆయుధం

నిర్మాతల మధ్య బ్లాంక్ చెక్ అనేది ఒక ఆయుధం

మరోసారి సోషల్ మీడియాలో వచ్చే కథనాలు జీవిత, రాజశేఖర్ లను ఇరకాటంలోకి నెట్టాయి. గరుడవేగ సినిమా విషయంలో రాజశేఖర్, జీవితలపై వచ్చిన ట్రోల్స్ పై జీవిత స్పందించారు. నేను, నా కుటుంబం ఎవరినైనా మోసం చేసింది చూశారా.. అని ప్రశ్నించారు.  సోషల్ మీడియాలో తనపై వచ్చే కథనాలు మరెవరిపైనా ఉండవని ఆరోపించారు. గరుడవేగ సినిమా విషయంలో మా ఆస్తులమ్మి ఖర్చుపెట్టాం.. నిర్మాతల మధ్య బ్లాంక్ చెక్ అనేది ఒక ఆయుధం అని జీవిత అన్నారు. గరుడవేగ నిర్మాతలకు, మాకు మధ్య కేసు కోర్టులో నడుస్తుందని చెప్పారు. మేం ఎంతో కష్టపడి ఇక్కడ మనుగడ సాధిస్తున్నామన్న ఆమె... తప్పు చేస్తే రోడ్డు మీద నిల్చొబెట్టి కొట్టండి అని మండిపడ్డారు. 25 ఏళ్లుగా తాను అనుభవిస్తున్న బాధ అంతా ఇంతా కాదని, తన బాధను ఫిల్మ్ చాంబర్ తో పంచుకుంటూనే ఉన్నానంటూ వాపోయారు. సోషల్ మీడియాపై వచ్చే వార్తలకు కోర్టుల చుట్టూ తిరిగే సమయం లేదన్న జీవిత.... సినిమాలో అన్ని కులాలు, మతాల వ్యక్తులతో పనిచేస్తామని స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తల కోసం..

RRRపై వెనక్కి తగ్గిన జీ5.. నో ఎక్స్ ట్రా మనీ 

రూ.1200కోట్ల క్లబ్ లో KGF 2