
సోషల్ మీడియాలో సినిమాలపై ట్రోలింగ్ ఎక్కువైందన్నారు నిర్మాత ఆదిశేషగిరి రావు. గురువారం ఫిలిం ఛాంబర్ లో ప్రోడ్యూసర్ కౌన్సిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్, మా ప్రెసిడెంట్ మాదాల రవితో పాటు మరికొందరు పాల్గొన్నారు. ఓటిటిలపై మొదటి నుంచి సెన్సార్ లేదన్నారు ఆదిశేషగిరి రావు. దీనిపై ప్రభుత్వంతో చర్చించాలన్నారు. ఫిల్మ్ పైరసీని అరికట్టడంలో ఫిలించాంబర్ విఫలమైందని, సినిమాలు విడుదలైన మరుసటి రోజే ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో వస్తున్నాయని నిర్మాతక మండలి కూడా గ్రూపులుగా విడిపోయిన పరిస్దితి ఏర్పడిందన్నారు. వ్యవస్థ మొత్తం వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు ఆది శేషగిరి రావు. ప్రస్తుతం ఓటీటీ సమస్యగా మారిందని, సెన్సార్ లేకుండా కంటెంట్ వస్తుందన్నారు. అనంతరం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నెగిటివ్ న్యూస్ బాగా వేస్తున్నారన్నారు. చివరగా టికెట్ల రెట్స్ పెంచడం మంచిది కాదని నిర్మాత దిల్ రాజు మాట్లాడారని, అలాంటప్పుడు ప్రభుత్వంను పెంచమని అడిగేటప్పుడే ఫ్లెక్సిబుల్ రెట్స్ గురించి తెలుసుకుని అడగాల్సిందన్నారు. అలా చేస్తే సమస్యలు వచ్చేవికావని ఆయన అభిప్రాపడ్డారు.
మరిన్ని వార్తల కోసం..