- కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ శుక్రవారం ములుగు క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అలాగే బీఆర్ఎస్కు చెందిన ములుగు మాజీ ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్, తాడ్వాయి మాజీ ఎంపీపీ వాణిశ్రీ కూడా కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ పాల్గొన్నారు.
