- ఉదయం 7 నుంచి మధ్యాహ్నం
- 12 గంటల వరకు సర్వీసులు బంద్
హైదరాబాద్సిటీ/బషీర్బాగ్, వెలుగు: యాప్ ఆధారంగా నడిపే ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లు శనివారం నిరసన చేపట్టనున్నారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాంవర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది. ర్యాపిడో, ఉబర్, ఓలాతో పాటు ఆటోలు, గూడ్స్ వాహనాలు, పోర్టర్ డ్రైవర్లు దేశవ్యాప్తంగాసేవలను ఎక్కడికక్కడే నిలిపివేయనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసనలో భాగంగా హైదరాబాద్ లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి వేయనున్నామని యూనియన్ అధ్యక్షుడు షేక్ సులావుద్దీన్ వెల్లడించారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గిగ్వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రేటు నిర్ణయించి కంపెనీల దోపిడీని అరికట్టాలన్నారు.
అలాగే..ఆటో, క్యాబ్, టాక్సీ, లారీ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు బంద్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మోటార్ కార్మికుల సంఘాల జేఏసీ ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు అమలుతో ఆటోడ్రైవర్ల ఆదాయంపై తగ్గిందని తెలిపింది. ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలను నియంత్రించాలని కోరింది.
