మనీలాండరింగ్ కేసులో..డెక్కన్ క్రానికల్ చైర్మెన్ అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో..డెక్కన్ క్రానికల్ చైర్మెన్ అరెస్ట్

రాష్ట్రంలో ఐటీశాఖ, ఈడీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ఉదయం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల ఇండ్లలో ఐటీ శాఖ అధికారులు మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు.  తాజాగా  ప్రముఖ వ్యాపారవేత్త,  డెక్కన్ క్రానికల్ చైర్మెన్ వెంకట్రామి రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో విచారణకు పిలిచిన  ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.  డీసీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డిపై గతంలో రుణాలు ఎగవేసిన  ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.  సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు జరిపింది. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరులోని డెక్కన్‌ క్రానికల్‌కు చెందిన 14 ఆస్తులు అటాచ్‌ చేసింది. డెక్కన్‌ క్రానికల్‌ బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో ఆరు FIRలు నమోదు చేసింది. గతంలో రూ.386 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా డీసీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డితో పాటు మరో వ్యాపారవేత్త మణి అయ్యర్‌ను హవాలా అరెస్ట్ చేసింది. 

డీసీ వెంకట్రామిరెడ్డి గతంలో వేర్వేరు బ్యాంకులు నుంచి రూ. 8800 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలను ఆయన  తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.  ఈ  కేసును ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే వెంకట్రామిరెడ్డిని విచారణకు పిలిచారు. విచారించిన తర్వాత  వెంకట్రామిరెడ్డి, మణి అయ్యర్ అను ఈడీ అరెస్ట్ చేసింది.