
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు వర్తిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22 నుండి జూన్ 15 వరకు అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగించింది.జూన్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ , రాజ్‌నంద్‌గావ్‌లలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాలు సైతం విపరీతంగా ఉంటాయనివాతావరణ శాఖ అంచనా వేసింది