రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. టికెట్ బుకింగ్ పై IRCTC కీలక నిర్ణయం.. అది ఉంటేనే ప్రయాణం

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. టికెట్ బుకింగ్ పై IRCTC కీలక నిర్ణయం.. అది ఉంటేనే ప్రయాణం

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. ఆన్ లైన్  లో టికెట్ బుకింగ్ ప్రక్రియలో పెద్ద మార్పులు తీసుకొచ్చింది రైల్వే శాఖ. తాత్కాల్, అడ్వాన్స్ బుకింగ్ కు ఆధార్ వెరిఫికేషన్ ను తప్పని సరి చేసింది.ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయని కంప్లైంట్స్ రావడంతో రూల్స్ ను మరింత కఠినతరం చేసింది రైల్వే శాఖ. 

కొత్త రూల్స్ ప్రకారం..ఆన్ లైన్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే ముందుగా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.  ఆ తర్వాతే తమ అకౌంట్ల ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవాలి. ఆధార్ వెరిఫికేషన్ ఉంటేనే టికెట్లు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) మొదటి రోజు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతావారికి మరుసటి రోజు మాత్రమే టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ఐఆర్ టీసీ అనుమతించింది.  

తాత్కాల్  టికెట్ బుకింగ్ కు  ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. తాత్కాల్ కోటా దుర్వినియోగం కాకుండా  అరికట్టేందుకు, నకిలీ అకౌంట్లను  నియంత్రించేందుకు  ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ  ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మార్పులతో పాటు రైల్వే శాఖ ప్రయాణికులకు మరికొన్ని సదుపాయాలు కల్పిస్తూ  ఈ ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ప్రయాణికులు తమ ఫుడ్ బుకింగ్ ను ప్రయాణానికి ముందే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రయాణంలో  వారి బెర్త్ కు డెలీవరి చేస్తారు. అయితే సెలెక్ట్ చేసిన 25 రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం ఉంది. టికెట్ ధరలో ఫుడ్ చేర్చని రైళ్లలో, ఆన్ బోర్డు ప్యాంట్రీ అందుబాటులో లేని రైళ్లలో  మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.