అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్..ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పుచెప్పింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని వెల్లడించింది. ఏకపక్షంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్దమని .. ట్రంప్ తన అధికారు పరిధిని దాటారని కోర్టు హెచ్చరించింది. సుంకాల విషయంలో ట్రంప్ తీరు చట్ట విరుద్దమని దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్దమని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉద్దేశించిన చట్టాన్ని తన అధికార పరిధిని దాటి దుర్వినియోగం చేసిందని పేర్కొంది. సుంకాల విషయంలో ట్రంప్ తీరు చట్ట విరుద్దమని దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
1977 చట్టం ప్రకారం.. అమెరికా కాంగ్రెస్ కు సుంకాలను జారీచేసే అధికారం ఇచ్చింది అమెరికా రాజ్యాంగం. డొనాల్డ్ ట్రంప్ తన అధికారాన్ని మించి చట్టాన్ని ఉల్లంఘించారని దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ శుక్రవారం (ఫిబ్రవరి 20) అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ సంచలన తీర్పునిచ్చారు.
దిగుమతి సుంకాలను విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి ఎటువంటి అధికారం లేదు అని మెజార్టీ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలతో వివిధ దేశాలపై విదించిన సుంకాలు చెల్లవని వెల్లడించింది. ఈ సంచలన తీర్పు తర్వాత అమెరికా మార్కెట్లు మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయిల్ యావరేజ్ 93.81 పాయింట్లు పెరిగింది.
