LB నగర్ చెట్నీస్‎లో పేలుడు.. తినే ప్లేట్లు వదిలి బయటకు పరుగులు తీసిన కస్టమర్లు

LB నగర్ చెట్నీస్‎లో పేలుడు.. తినే ప్లేట్లు వదిలి బయటకు పరుగులు తీసిన కస్టమర్లు

హైదరాబాద్: ఎల్బీ నగర్‎లోని చెట్నీస్ హోటల్‎లో భారీ పేలుడు సంభవించింది. ఇడ్లీ స్టిమర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి హోటల్‎లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దానికి తీవ్ర భయాందోళనకు గురైన కస్టమర్లు తినే ప్లేట్లు వదిలి బయటకు పరుగులు తీశారు.

ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం.. గాయపడ్డవారిని గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించింది. కస్టమర్ల ద్వారా సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

కస్టమర్లకు పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. తీవ్రంగా గాయపడ్డ హోటల్ సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.