వాళ్లు స్క్రాప్ ను అమ్ముకుని జీవనం సాగించే వాళ్లే కానీ.. వాళ్ల మెదళ్లలో మాత్రం స్క్రాప్ ఉండదని రుజువు చేశారు హర్యానాకు చెందిన స్క్రాప్ డీలర్లు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చేసి తమ గొప్ప గుణం చాటుకున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఢిల్లీ-హర్యానా పరిసరాలలోని ఫరీదాబాద్ లో జరిగింది ఈ ఆసక్తకర పరిణామం. అదే పట్టణానికి చెందిన అశోక్ శర్మ అనే వక్తికి చెందిన బంగారాన్ని.. చెత్తతో పాటు అనుకోకుండా అమ్మేశాడు. ఆ తర్వాత 4 నెలలకు స్క్రాప్ డీలర్లు బంగారాన్ని తెచ్చి ఇవ్వటంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగ తర్వాత.. పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా 100 గ్రాముల గోల్డు జువెలరీని ఇచ్చేశారు. ఇల్లును క్లీన్ చేస్తూ.. చెత్తను అమ్ముకునే క్రమంలో.. ఆభరణాలు ఉన్న బాక్సును కూడా ఇచ్చేశారు. కుంభమేళా యాత్రకు వెళ్లే క్రమంలో బాక్సులో పెట్టిన ఆభరణాలను.. దీవాళి క్లీనింగ్ లో బై మిస్టేక్ లో స్క్రాప్ డీలర్ కు అమ్ముకున్నారు.
ఆ తర్వాత నగలు ఎక్కడమిస్సయ్యాయా అనే క్రమంలో.. స్క్రాప్ డీలర్ కు ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. వెంటనే స్క్రాప్ డీలర్ దగ్గరకు వెళ్లి చెప్పగా.. ఎంత వెతికినా దొరకక పోవడంతో నిరాశతో ఇంటికి చేరుకున్నారు.
ఒక 4 నెలల తర్వాత ఖాన్ సాబ్ అనే పేరున్న హజీ అఖ్తర్ ఖాన్ అనే స్క్రాప్ డీలర్.. స్క్రాప్ మొత్తాన్ని వేరు చేస్తుండగా బంగారాన్ని గుర్తించాడు. స్వర్ణకారుల దగ్గర పరీక్షించగా అది అసలు బంగారమే అని తేలడంతో పోలీసులకు అందజేశాడు.
అప్పటికే బంగారం పోయినట్లు అశోక్ శర్మ కంప్లైంట్ ఇవ్వడంతో.. ఆయనను పిలిపించి ఖాన్ సాబ్ చేతుల మీదుగా బంగారాన్ని శర్మకు అప్పగించారు ఏసీపీ మల్హోత్ర. ఈ సందర్భంగా ఖాన్ సాబ్ ను అభినందించారు పోలీసులు.
చెత్తను వేరు చేస్తుండగా పేపర్లో చుట్టిన బాక్సు దొరికింది. అందులో ఉన్న నగలు అసలా, నఖిలీనా అని పరీక్షిస్తే.. అసలైనవేనని తేలింది. పోగొట్టుకున్న వాళ్లు ఎంత బాధ పడుగతుంటారో నాకు తెలుసు. అందుకే పోలీసులకు అప్పగించాను. మొత్తానికి శర్మగారికి వారి బంగారం అందజేయటం చాలా సంతోషంగా ఉంది.. అంటూ ఖాన్ సాబ్ ఆనందం వ్యక్తం చేశాడు.
